అక్షరటుడే, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సంకల్ప పత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేశారు. మేనిఫెస్టోలో పది గ్యారంటీలు ఉన్నాయి. రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు(నెలకు) రూ.10 వేలు, మహిళలకు(నెలకు) రూ. 2,100, ఆశా కార్యకర్తలకు రూ. 15 వేల వేతనం, 25 వేల మహిళా పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, ఐదేళ్లలో 25 లక్షల యువతకు ఉద్యోగాలు ఇస్తామని పేర్కొంది. అలాగే విద్యుత్ ఛార్జీల్లో 30 శాతం రాయితీ, 45 వేల గ్రామాలకు రోడ్ల అనుసంధానం ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా ఉన్నాయి.