అక్షరటుడే, జుక్కల్ : అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడారు. గత కొద్ది రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివారం కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఇన్నోవేషన్ ఫోరమ్ లో ఆయన ప్రసంగించారు. జుక్కల్ నియోజకవర్గ స్థితిగతులపై ఒక షార్ట్ వీడియోను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తూ అంతర్జాతీయ వేదికపై వివరించారు.