అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమం వద్దకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు 10 కోట్ల మైలురాయిని దాటిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన ఈ మేళా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.