అక్షరటుడే, వెబ్డెస్క్ : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత నిధులు విడుదలయ్యాయి. ఇవాళ మహారాష్ట్రలోని వాషింలో ప్రధాని మోదీ ఈ నిధులను డీబీటీ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.20,000 కోట్లు విడుదల చేశారు.