అక్షరటుడే, కామారెడ్డి : జ్యూస్ అనుకుని ఇద్దరు చిన్నారులు పురుగుల మందు తాగిన ఘటన రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన గంగావత్ సంజన (9), గంగావత్ బిందు(7) పాఠశాల నుంచి ఇంటికి వచ్చారు. అయితే తల్లిదండ్రులు వ్యవసాయ పొలానికి పురుగుల మందు(టైగర్) వాడి మిగిలిన డబ్బాను ఇంట్లో ఉంచారు. అయితే మందు డబ్బాను చూసిన చిన్నారులు జ్యూస్ అనుకుని తాగేశారు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి ఎల్లారెడ్డిపేట అశ్విని ఆస్పత్రికి తరలించారు.