అక్షరటుడే, కామారెడ్డి: తల్లీకూతురు అదృశ్యమైన ఘటన దోమకొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్రాగుల కళావతి, ఆమె కూతురు భవాని రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. భర్తతో గొడవ జరగడంతో కూతురితో పాటు కళావతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.