అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుమన్, జిల్లా అధ్యక్షుడు మహిపాల్ చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష కొనసాగుతోంది. బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.