అక్షరటుడే, వెబ్​డెస్క్​: సొంత పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థినే సీఎం ఓడించే ప్రయత్నం చేస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి బక్క జడ్సన్ ఆరోపించారు. ఆదివారం నగరంలోని ప్రెస్​క్లబ్​లో మాట్లాడారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​బాబు నరేందర్​రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్​ ఇప్పించుకోగా.. సీఎం వెంటనే రంగంలోకి దిగి మరో మంత్రి పొన్నం ప్రభాకర్​ ద్వారా ప్రసన్న హరికృష్ణతో ఇండిపెండెంట్​గా నామినేషన్​ వేయించారన్నారు. ఇలా సొంత పార్టీ అభ్యర్థినే ఓడించే ప్రయత్నాలు సీఎం చేస్తున్నారని ఆరోపించారు. 34 ఏళ్లుగా కాంగ్రెస్​కు సేవ చేశానని.. అయినప్పటికీ తనను పార్టీలో నియంత్రించారన్నారు. పట్టభద్రులంతా నావైపు నిలిచి గెలిపిస్తే.. వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు.