అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పోరాడుతోంది. నాలుగో రోజు బ్యాడ్ లైట్ తో ముందుగానే అంపైర్లు ఆటను ముగించారు. ఆట ముగిసే సమయానికి భారత్ తొమ్మిది వికెట్లను కోల్పోయి 252 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 77 పరుగులతో రాణించాడు. ఆఖరిలో ఆకాష్ దీప్(27), బుమ్రా(10) పోరాడడంతో భారత్ ఫాలో ఆన్ గండం తప్పించుకుంది. అయితే భారత్ ఇంకా 193 పరుగులు వెనకబడి ఉంది.