అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ ఓడిపోయింది. మూడో రోజు ఆట మొదలు పెట్టిన భారత్ 16 పరుగులు మాత్రమే జోడించి 157కు ఆల్ అవుట్ అయింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. దీంతో 5 టెస్ట్ ల బోర్డర్ – గవాస్కర్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-1తో గెలుపొందింది. ఉస్మాన్ ఖవాజా(41), బ్యూ వెబ్ స్టర్ 39 పరుగులు చేశారు. కాగా గాయంతో నిన్న మ్యాచ్ మధ్యలో నుంచి వెళ్లిపోయిన బుమ్రా సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయలేదు. ఈ మ్యాచ్ గెలుపుతో ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది.