అక్షరటుడే, వెబ్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో భారత్‌ 128/5 స్కోరు చేసింది. అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న పింక్‌ బాల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. యశస్విజైపాల్‌, గిల్‌, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ నిరాశపర్చారు. ఆట ముగిసే టైంకు రిషబ్ పంత్‌, నితీశ్‌ రెడ్డి క్రీజులో ఉన్నారు.