India Vs New Zealand : హోరాహోరీ.. ఈ రోజు ఫైన‌ల్‌లో విజేత ఎవ‌రు, భార‌త్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

India Vs New Zealand : హోరా హోరి.. ఈ రోజు ఫైన‌ల్‌లో విజేత ఎవ‌రు, భార‌త్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
India Vs New Zealand : హోరా హోరి.. ఈ రోజు ఫైన‌ల్‌లో విజేత ఎవ‌రు, భార‌త్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ India Vs New Zealand : వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌స్ట్‌లో మిస్ చేసుకున్న భార‌త్ ఇప్పుడు ఛాంపియ‌న్స్ ట్రోఫీ ద‌క్కించుకునేందుకు చాలా క‌సి మీద ఉంది. మ‌రి కొద్ది గంట‌ల‌లో ఫైన‌ల్ మ్యాచ్ ఉండ‌గా, భారత్‌, న్యూజిలాండ్ జ‌ట్ల‌లో ఎవరు గెలుస్తారనే టెన్ష‌న్ క్రికెట్‌ ఫ్యాన్స్‌ని ఊపేస్తోంది.. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఒక్క టికెట్‌ ధర 3 లక్షలు పలుకుతోంది. ఇప్పటికే క్రికెట్‌ అభిమానులంతా దుబాయ్‌లో వాలిపోవ‌డ‌మే కాక భార‌త్ జ‌ట్టు క‌ప్ కొట్టాల‌ని పూజలు చేస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ టోర్నీ లో భార‌త్ ఒక్క మ్యాచ్ కూడా ఓడింది లేదు.

India Vs New Zealand : టెన్ష‌న్ … టెన్ష‌న్..

మూడు లీగ్ మ్యాచ్‌లతో పాటు సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్టును ఓడించడంతో భార‌త్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది.2013లో భార‌త్ ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలుచుకోగా, 2017లో రన్నరప్‌గా నిలిచింది. ఇక ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ఉంది రోహిత్‌ సేన. వ‌చ్చే ఛాంపియ‌న్స్ ట్రోఫీకి రోహిత్‌, విరాట్ ఉండ‌డం కాస్త క‌ష్ట‌మే. అందుకే ఈ సారి వ‌చ్చిన అవకాశాన్ని వారిద్ద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. భారత జట్టులో విరాట్‌ కోహ్లీ ఫామ్‌లో ఉండటం ప్లస్‌ పాయింట్‌.. ఒంటి చేత్తో విజయాలు అందిస్తున్నాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  Donald Trump : భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కిన డొనాల్డ్ ట్రంప్

ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీ 45 పరుగులు చేస్తే క్రిస్‌ గేల్‌ రికార్డ్‌ను బద్దలు కొడతాడు. అలానే సెంచరీ చేస్తే న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన సచిన్‌ రికార్డ్‌ను బద్దలు కొడతాడు. ఇక రోహిత్ శ‌ర్మ ఈ టోర్నీలో పెద్ద‌గా ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది లేదు. అందుకే ఫైన‌ల్ మ్యాచ్‌లో విశ్వ‌రూపం చూపించి క‌ప్ కొట్టాల‌ని ఉవ్విళూరుతున్నాడు. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌, హార్డిక్‌ పాండ్యా ఫామ్‌లో ఉండటం భార‌త్ కి కాస్త శుభ‌ప‌రిణామం. మహ్మద్‌ షమీ పేస్‌ బౌలింగ్ ,వరుణ్‌ చక్రవర్తి ,అక్షర్‌, పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌లతో భారత్‌ బౌలింగ్ గ‌ట్టిగానే ఉంది. ఇక ఇక్క‌డ ఓ ట్విస్ట్ ఉంది. స‌రైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌క‌పోయిన‌, మ్యాచ్ ఓడిన రోహిత్ శ‌ర్మ వ‌న్డేల‌కి గుడ్ బై చెప్పే అవ‌కాశం ఉంది.

Advertisement