అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను తన సొంత గడ్డపై చిత్తు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ అయిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో జైస్వాల్, కోహ్లీ సెంచరీలకు తోడు రాహుల్ రాణించడంతో భారీ స్కోరు సాధించింది. 487/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత బౌలర్ల విజృంభణతో మొదటి ఇన్నింగ్స్ లో 104 పరుగులకే ఆలౌట్ అయిన ఆసీస్ 534 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. మూడో రోజు ఆట ప్రారంభించిన కొద్దిసేపటికి 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా నాలుగో రోజు పోరాడింది. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ రాణించడంతో ఆ జట్టు స్కోర్ బోర్డు 200 దాటింది. 238 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ కావడంతో భారత్ ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు, సిరాజ్ మూడు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశారు.