అక్షరటుడే, వెబ్డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన భారత్–పాక్ మ్యాచ్లో ఇండియా జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో క్లోహ్లీ సెంచరీతో చెలరేగి ఆడి భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 241 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. అనంతరం భారత జట్టు బరిలోకి దిగగా దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ(20) వద్ద ఔట్ అయ్యాడు. దీంతో కోహ్లీ జట్టు గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. శుభ్మన్ గిల్(46), శ్రేయస్ (56)లు వెనుదిరిగినా.. కోహ్లీ సెంచరీతో జట్టు గెలుపులో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ సెంచరీతో 14వేల పరుగుల మైలు రాయిని దాటి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.