అక్షరటుడే, వెబ్​డెస్క్​: అండర్​–19 మహిళా టీ–20 ప్రపంచ్​కప్​ను భారత్​ సొంతం చేసుకుంది. ఆదివారం సౌత్​ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో బౌలర్లు, బ్యాటర్లు విజృంభించడంతో భారత జట్టు సునాయాసంగా విజయం సాధించింది. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న సౌత్​ ఆఫ్రికాను భారత బౌలర్లు 82 పరుగులకే అలౌట్​ చేశారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఇండియన్​ టీం 11.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. తెలంగాణ క్రీడాకారిణి గొంగడి త్రిష 44 పరుగులతో రాణించింది.