అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఇండియన్ ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో కదిలే మోటారు బైక్‌లపై హ్యూమన్ పిరమిడ్‌తో ఈ అసాధారణ ఘనతను సొంతం చేసుకుంది. ఏడు మోటార్ వాహనాలపై నిలబడి కర్తవ్యపథ్‌లోని విజయ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు రెండు కిలోమీటర్ల మేర ఈ రైడ్ కొనసాగింది. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్‌లో మొత్తం 40 మంది పాల్గొన్నారు. ఈ ఫీట్‌తో గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులతో సహా 33 ప్రపంచ రికార్డులను సాధించింది.