అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం పాజిటివ్ గా స్పందించాయి. రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. ఉదయం 281 పాయింట్ల గ్యాపప్ తో ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో ఒడిదుడుకులకు లోనైనా ఆ తర్వాత పుంజుకుంది. ఇంట్రాడేలో గరిష్టంగా 701 పాయింట్లు లాభపడి చివరికి 597 పాయింట్ల లాభంతో 80,845 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్ల లాభంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 205 పాయింట్లు పెరిగింది. చివరికి 181 పాయింట్ల లాభంతో 24,457 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఫిఫ్టీలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, ఎల్టీ, ఆక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ రెండు శాతానికి పైగా, ఓఎన్జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, హెచ్సీఎల్ టెక్, శ్రీ రామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, రిలయన్స్, టాటా మోటార్ ఒక శాతానికి పైగా పెరిగాయి. ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివిస్ ల్యాబ్, హీరో మోటార్, ఐటీసీ, ఎల్టీఐఎం నష్టపోయాయి.