అక్షరటుడే, వెబ్డెస్క్: ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో రెచ్చిపోయాడు. 37 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేశాడు. దీంతో టీ20లలో వేగవంతంగా సెంచరీ చేసిన జాబితాలో మూడో స్థానానికి చేరాడు. డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్లో భారత్ 13 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.