అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ జైస్వాల్ ఆఫ్ సెంచరీతో రాణించాడు. మొదటి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయినా జైస్వాల్ రెండో ఇన్నింగ్స్ లో చక్కని బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. రెండో రోజు 104 పరుగులకు ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసిన భారత్‌కు రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు శుభారంభం చేశారు. జైస్వాల్(51), రాహుల్(41) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 147 పరుగుల లీడ్‌లో ఉంది.