అక్షరటుడే, వెబ్​డెస్క్​: అమెరికా ఫెడరల్​ బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్​(ఎఫ్​బీఐ) డైరెక్టర్​గా భారత సంతతికి చెందిన కాష్​ పటేల్​ బాధ్యతలు చేపట్టారు. వైట్​ హౌస్​లో జరిగిన కార్యక్రమంలో ఆయన భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేశారు. బాధ్యతలు చేపట్టగానే ఆయన ప్రధాన కార్యాలయంలోని వెయ్యి మంది ఉద్యోగులను బదిలీ చేశారు.