అక్షరటుడే, వెబ్ డెస్క్: వంద బిలియన్ డాలర్ల క్లబ్‌ నుంచి భారత కుబేరులు ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ వైదొలిగారు. ఈ ఏడాది వారి సంపద తగ్గినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్ పేర్కొంది. ఈ ఏడాది చివర్లో వ్యాపారపరంగా వారు ఎదుర్కొంటున్న ఒడుదొడుకులే ఇందుకు కారణమని వివరించింది. ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది జులైలో 120.8 బిలియన్‌ డాలర్లు ఉండగా.. ఈనెల 13 నాటికి 96.7 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. గౌతమ్ అదానీ సంపద గత జూన్‌లో 122.3 బిలియన్‌ డాలర్లు ఉండగా.. ఈ నెల నాటికి 40 బిలియన్లు తగ్గి 82.1 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.