అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న టెస్ట్‌మ్యాచ్‌లో భారత్ బ్యాట్స్‌మెన్ దుమ్ము లేపారు. మ్యాచ్‌లో విరాట్‌కోహ్లి, యశస్వి జైస్వాల్ ఇద్దరూ సెంచరీలు చేశారు. వన్డే క్రికెట్ మాదిరిగా వేగంగా పరుగులు సాధించారు. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి భారత్ 487 పరుగులు చేసింది. మొత్తంగా 533 పరుగుల వద్ద భారత్ డిక్లేర్ చేసింది. 534 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. టెస్టుల్లో విరాట్ కోహ్లి 30 సెంచరీలు చేశాడు. మొత్తంగా 81 సెంచరీలు పూర్తి చేశాడు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఒక్క పరుగు కాకుండానే వికెట్ కోల్పోయింది.