అక్షరటుడే, ఆర్మూర్: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రస్తుతం 6539 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుత సీజన్‌లో ఆరు వేలకు పైగా క్యూసెక్కుల వరద రావడం ఇదే తొలిసారి. జలాశయం నుంచి 447 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1063.60 అడుగుల (14.356 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 224.795 టీఎంసీల నీరు నిల్వ ఉంది.