అక్షరటుడే, ఇందూరు: కళాశాలలు ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించాలని ఇంటర్ విద్యాధికారి రవికుమార్ అన్నారు. ప్రైవేటు కళాశాలల తనిఖీల్లో భాగంగా గురువారం నగరంలోని కాకతీయ జూనియర్ కాలేజీని సందర్శించారు. అనంతరం ప్రయోగశాల, తరగతి గదులను పరిశీలించారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.