ఐ-ఫోన్ 15 మ్యాక్స్ రిలీజ్ మరింత ఆలస్యం.. కారణం అదేనా?!

0

ఆపిల్ తన ఐ-ఫోన్15 సిరీస్ ఫోన్లను వచ్చేనెల 12న ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ల కలర్ షేడ్స్‌తోనే చార్జింగ్ కోసం వినియోగించే యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వస్తున్నది.

iPhone 15 | గ్లోబల్ టెక్ జెయింట్ ‘ఆపిల్’ తన ఐ-ఫోన్15 సిరీస్ ఫోన్లు వచ్చే నెల 12న మార్కెట్‌లో ఆవిష్కరించనున్నది. త్వరలో మార్కెట్లోకి వచ్చేసే ఐ-ఫోన్ 15, ఐ-ఫోన్ 15 ప్లస్, ఐ-ఫోన్ 15 ప్రో, ఐ-ఫోన్15 ప్రో మ్యాక్స్ వేరియంట్లు యూఎస్బీ టైప్-సీపోర్ట్ కలిగి ఉంటాయని తెలుస్తున్నది. ఐ-ఫోన్ 15, ఐ-ఫోన్ 15 ప్లస్ ఫోన్ల కలర్ మ్యాచ్డ్ యూఎస్బీ టైప్-సీ కేబుల్స్‌తో వస్తున్నాయని సమాచారం. కొన్ని ప్రొడక్షన్ సమస్యల వల్ల ఐ-ఫోన్ 15 మ్యాక్స్ ఫోన్‌ను ఆపిల్.. అక్టోబర్‌లో రిలీజ్ చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది.

ఐ-ఫోన్ 15, ఐ-ఫోన్ 15 ప్లస్ ఫోన్లు బ్లాక్, వైట్, ఎల్లో, పర్పుల్, ఆరంజ్ షేడ్ కలర్స్‌తో వస్తున్నాయని సమాచారం. యూఎస్బీ టైప్-సీ కేబుల్స్ ట్యూబ్స్ పనితీరు మరింత మెరుగు పడుతుందని భావిస్తున్నారు. ఐ-ఫోన్-15 సిరీస్ ఫోన్ల ప్రీ-బుకింగ్స్ వచ్చేనెల 22న ప్రారంభం అవుతాయి. దానికి పదిరోజుల ముందే అంటే వచ్చేనెల 12న ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరిస్తారు.

కానీ ఐ-ఫోన్ 15 ప్రో మాక్స్, ఐ-ఫోన్ 15 ఆల్ట్రా వేరియంట్ ఫోన్ల ఆవిష్కరణ కాసింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ సెరిస్కోప్ కెమెరాతోపాటు సోనీ రూపొందించే ఇమెజ్ సెన్సర్ ఇప్పటికిప్పుడు సరఫరా చేయలేకపోతున్నది. అందువల్లే ఐ-ఫోన్15 మ్యాక్స్ ఫోన్ల డెలివరీ అక్టోబర్ 6- 13 తేదీల మధ్య జరుగుతాయి.

ఈ ఏడాది మార్కెట్లోకి వస్తున్న ఆపిల్ ఐ-ఫోన్ 15 ఫోన్లన్నీ డైనమిక్ ఐలాండ్ ఫీచర్ కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఐ-ఫోన్ 14 ప్రో మోడల్ ఫోన్లలో ఈ ఫీచర్ ఉంది. ఆపిల్ ఐ-ఫోన్ 15 ఫోన్ ఏ17 బయోనిక్ 6జీబీ ఆఫ్ ఎల్పీడీడీఆర్5 రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది. టాప్ హై ఎండ్ వర్షన్ ఐ-ఫోన్ల బేస్ మోడల్ 2 టిగా బైట్స్ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది.