అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రతినిధి చిన్మయి కృష్ణదాస్ ప్రభును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నగరంలో ఇస్కాన్ సభ్యులు శుక్రవారం ధర్నా చేపట్టారు. కృష్ణ దాస్‌ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇస్కాన్ మతతత్వ సంస్థ కాదని మానవత్వ సంస్థ అన్నారు. లోక కళ్యాణం కోసం పని చేసే సంస్థను నిషేధించాలని బంగ్లా ప్రభుత్వం అనుకోవడం సిగ్గుచేటని నినాదాలు చేశారు. దైవ భక్తులను అక్రమ కేసులతో అరెస్ట్ చేయడానికి వారు ఖండించారు.