అక్షరటుడే, ఇందూరు: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో జిల్లాలో సగటున 15.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా అత్యధికంగా ముప్కాల్‌ మండలంలో 43.5 మిల్లీమీటర్లు, నవీపేట 29 మి.మీ., మెండోరా 28.2 మి.మీ., నిజామాబాద్‌ సౌత్‌ 25.5, నిజామాబాద్‌ రూరల్‌ 24.6 వాన పడిరది. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, వాగులు కళకళలాడుతున్నాయి.