అక్షరటుడే, నిజామాబాద్: నగరంలో భారీ వర్షం కురుస్తోంది. సోమవారం మధ్యాహ్నం వాన ప్రారంభమైంది. సుమారు గంటసేపటి నుంచి జోరు వాన పడుతోంది. ఉరుములతో కూడిన కుండపోత వర్షం కురుస్తుండడంతో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.