అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో కొత్తగా 12 ఇండస్ట్రియల్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాబోయే ఏడాదికాలంలో ఈ పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సలభతరమైన నూతన పాలసీని తీసుకువచ్చామని వెల్లడించారు. మహిళలను ప్రోత్సహించేందుకు ఇండస్ట్రియల్‌ పార్కులను ఏర్పాటు చేస్తామని చెప్పారు.