అక్షరటుడే, కోటగిరి : పంట చేతికొచ్చాక కురుస్తున్న వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. కోటగిరి మండలంలో శనివారం రాత్రి వర్షం కురిసింది. దీంతో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. చేతికొచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.