అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో రెండోరోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా తీస్తున్నారు. పుష్ప-2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై వివరాలు సేకరిస్తున్నారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు చేపట్టారు. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో.. అధికారులు బ్యాంకు లాకర్లు తెరిపించారు. ఈరోజు మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఐటీ సోదాల అనంతరం దిల్ రాజును ఎస్‌వీసీ ఆఫీస్‌కు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.