అక్షరటుడే, వెబ్ డెస్క్: కామారెడ్డి రైల్వే పోలీస్ అవుట్ పోస్టులో ఏఎస్సైగా పనిచేస్తున్న సుధాకర్ ను ఇండియన్ పోలీస్ మెడల్ వరించింది. రైల్వే పరిధిలోని వివిధ కేసుల్లో నేరస్థులను చాకచక్యంగా గుర్తించడంతో పాటు భారీగా నగదు, బంగారు ఆభరణాలు రికవరీ చేసిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన సేవలను గుర్తించి మెడల్ అందజేసేందుకు ఎంపిక చేసింది. 2018 లో రైల్వే ప్రయాణికుల సామాన్లు దొంగిలించిన హర్యానా గ్యాంగ్ ను పట్టుకోవడంతో పాటు రూ.1.60 కోట్ల సొత్తు, బంగారం రికవరీ చేశారు. ఇంకా మరెన్నో కేసుల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు.