అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : హైదరాబాద్ లో మంగళవారం రాత్రి జేసీఐ బంజారా ఆధ్వర్యంలో జరిగిన “గోవిందం” జోన్కాన్ లో జేసీఐ ఇందూర్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలకు అవార్డులు అందజేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, సెల్ఫ్ డిఫెన్స్, జేసీఐ వారోత్సవాల నిర్వహణ, పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలు, ఎడ్యుకేషన్ సపోర్ట్ కార్యక్రమాలకు పురస్కారాలు దక్కాయి.
వ్యక్తిగత విభాగంలో..
ఉత్తమ మాజీ జోన్ ఉపాధ్యక్షులుగా జేసీఐ ఇందూర్ అధ్యక్షుడు విజయానంద్ కు అవార్డు దక్కింది. జోన్ అధ్యక్షుడు గోవింద్ కంకానీ, జోన్ డైరెక్టర్లు శ్రేయ దీక్షిత్, రుబిన మదానీ, గుండా నికేలు , జోన్ అధికారులు సుచిత్ర కతూరి, బంగార్రాజు, నల్రాపురం రాజు, గుంటి సంతోష్ జేసీఐ ఇందూర్ ప్రతినిధులకు అందజేశారు. జోన్ కో-ఆర్డినేటర్ నయన్, పూర్వ అధ్యక్షులు విజయానంద్, లావణ్య, నిపున్ పాల్గొన్నారు. పురస్కారాలు రావడానికి సహకరించిన ప్రతిఒక్కరికి జేసీఐ ఇందూర్ అధ్యక్షులు మనోజ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.