Suspended | జుక్కల్ హెడ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు

Suspended | జుక్కల్ హెడ్ కానిస్టేబుల్ పై వేటు
Suspended | జుక్కల్ హెడ్ కానిస్టేబుల్ పై వేటు

అక్షరటుడే, కామారెడ్డి: Suspended : negligence, కామారెడ్డి జిల్లా జుక్కల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేసే అంబర్ సింగ్ పై వేటు పడింది. అతనిని సస్పెండ్​ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఉత్తర్వులు జారీ చేశారని ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులు, నేరస్థులతో అంబర్ సింగ్ చనువుగా ఉంటూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. డబ్బులు డిమాండ్ చేయడం కూడా తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వివరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement