అక్షరటుడే, జుక్కల్ : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సూచించారు. మద్నూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆయన తనిఖీ చేశారు. హాస్పిటల్‌లో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఆస్పత్రిలోని సమస్యల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. త్వరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.