అక్షరటుడే, జుక్కల్: తమది రైతు ప్రభుత్వమని, రైతుల మేలుకోరే అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం మద్నూర్‌లో మండల వ్యవసాయ అధికారితో ఆయన మాట్లాడారు. రైతు రుణమాఫీ గురించి చర్చించారు. అర్హత ఉన్నా మాఫీ కానీ రైతుల వివరాలు సేకరించి సమస్య పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి రైతుకు మాఫీ జరిగి తీరాలన్నారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.