అక్షరటుడే, నిజాంసాగర్: జుక్కల్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన మహా పడిపూజలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం ఆధ్యాత్మికతకు పేరుగాంచిందని, ఈ సాంప్రదాయాన్ని మనం ఇలాగే కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.