అక్షరటుడే, వెబ్​డెస్క్​: కబాలి నిర్మాత, డ్రగ్స్ వ్యవహారంతో విమర్శల పాలైన కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. కేపీ(కృష్ణ ప్రసాద్​) చౌదరి అనారోగ్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆయన 2016లో సినిమా రంగంలోకి వచ్చారు. కబాలి చిత్రం తెలుగు వెర్షన్​కు నిర్మాతగా వ్యవహరించారు. సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. సినీ రంగంలో కలిసిరాకపోవడంతో కేపీ చౌదరి గోవాలో పబ్ ప్రారంభించారు. ఆ బిజినెస్​లో కూడా నష్టాలు రావడంతో డ్రగ్స్​ దందాలోకి దిగారని అప్పట్లో వార్తలు వచ్చాయి. డ్రగ్స్​ కేసులో ఆయన ఓ సారి అరెస్ట్​ కూడా అయ్యారు. పలువురు లేడీ యాక్టర్స్​తో ఆయన సన్నిహితంగా ఉన్న ఫొటోలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.