అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత, ఢిల్లీ రవాణాశాఖ మాజీ మంత్రి కైలాశ్ గహ్లోత్ సోమవారం బీజేపీలో చేరారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం కైలాశ్ గహ్లోత్ ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను కేజ్రీవాల్‌కు పంపించారు. ప్రభుత్వం అసంపూర్తి హామీలు ఇస్తోందని, పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని గహ్లోత్ తన లేఖలో ఆరోపించారు.