అక్షరటుడే, కామారెడ్డి: రాష్ట్ర స్థాయిలో గణిత ప్రతిభా పరీక్ష పోస్టర్లను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను ఎంట్రెన్స్ టెస్ట్ లకు ప్రోత్సహించడానికి ప్రతిభా పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాడ్వాయి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి రామారావు, ఆర్థిక కార్యదర్శి నరేందర్ గౌడ్, గోవర్ధన్, రవి, వెంకటి తదితరులు పాల్గొన్నారు.