అక్షరటుడే, కామారెడ్డి: ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కామారెడ్డిలోని భవిత పాఠశాలలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఐటీ అసోసియేషన్ సెక్రెటరీ చెల్లపురం శ్రీకాంత్‌ను ఏఎస్పీ అభినందించారు. జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ తేజ, ఇర్షాద్ అలీ, శంకర్, పాఠశాల కరస్పాండెంట్ రాజశేఖర్ రావు పాల్గొన్నారు.