అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తే.. ప్రాణదానం చేసినట్లేనని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ట్రెజరీ కార్యాలయంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా ట్రెజరీ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉద్యోగులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఏటీవో, ఎస్టీవో, టీఎన్జీవోస్, ఉద్యోగులు, అధ్యక్ష కార్యదర్శులు దేవేందర్, సాయిరెడ్డి, వెంకట్ రెడ్డి, రెడ్ క్రాస్ ఛైర్మన్ రాజన్న, కరస్పాండెంట్ నర్సింహా తదితరులు పాల్గొన్నారు.