అక్షరటుడే, కామారెడ్డి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరిగే పరీక్షలపై గురువారం కలెక్టరేట్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, పరీక్షల విభాగం అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులు పాల్గొన్నారు.