అక్షరటుడే, కామారెడ్డి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. రాజంపేట మండలంలోని కొనుగోలు కేంద్రాలను ఆదివారం అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తూకం, గన్ని సంచుల సరఫరా, తాగునీటి సదుపాయాలపై రైతులతో అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన రైతుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.