దేశ ప్రగతిని మార్చడం ఓటుతోనే సాధ్యం

0

అక్షరటుడే, కామారెడ్డి: దేశ గతిని మార్చే శక్తి కేవలం ఓటు హక్కుకు మాత్రమే ఉంటుందని కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను గుర్తించి రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. స్వీప్‌ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం వాక్‌ టు పోలింగ్‌ స్టేషన్‌ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వడ్డెర కాలనీలో గల పోలింగ్‌ స్టేషన్‌ను కలెక్టర్‌ సందర్శించారు. అనంతరం ఎస్పీ సింధు శర్మతో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథరావు, స్వీప్‌ నోడల్‌ అధికారి వెంకటేశ్‌, బూత్‌స్థాయి అధికారి సుజాత, మహిళలు పాల్గొన్నారు.