అక్షరటుడే, బాన్సువాడ: మండలంలోని బోర్లం ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను డీఈవో రాజు శనివారం ప్రారంభించారు. ఎన్ఆర్ఐలు మీనాక్షి, ఆన్య, శాంభవి స్థాపించిన కోడ్ హోప్ గ్లోబల్ సంస్థ ద్వారా సుమారు రూ.నాలుగు లక్షలతో పది కంప్యూటర్లను, 10 వెబ్ కెమెరాలను పాఠశాలకు అందించారు. దీంతో వారిని డీఈవో అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వెంకటరమణ, ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నరసింహరావు, కోటేశ్వరరావు, గంగాకిషన్, గోవర్ధన్ రెడ్డి, నోడల్ అధికారి విజయకుమార్, నస్రుల్లాబాద్ ఎంఈవో చందర్, పాల్గొన్నారు.