అక్షరటుడే, బిచ్కుంద: ‘కాంగ్రెస్ 6 హామీలు, 66 మోసాల ఛార్జి షీట్’ బిచ్కుంద మండలంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతు కోసిందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ రాము, నాలుగు మండలాల అధ్యక్షులు, మల్లికార్జున్ దేశాయ్ శివాజీ పటేల్, తెప్పవార్ తుకారాం, నరేశ్, బీజేవైఎం కామారెడ్డి జిల్లా సెక్రెటరీ శెట్టిపల్లి విష్ణు, బీజేవైఎం బిచ్కుంద మండలాధ్యక్షుడు బుడాల గంగారాజ్, బీజేపీ మండలాధ్యక్షుడు ధనుర్ విఠల్, జుక్కల్ నియోజకవర్గ ఐటీ సెల్ కన్వీనర్ తమ్మేవార్ అజయ్ పాల్గొన్నారు.