అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అడుగులు వేయాలని డీఆర్డీవో చందర్‌ నాయక్‌ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి మండల సమాఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా క్యాంటీన్‌, ఈవెంట్‌ ప్రోగ్రామ్స్‌, పాడి పశువులు, పెరటి కోళ్ల పెంపకంపై వివరించారు. కామారెడ్డి మండల సమాఖ్య, గ్రామ సంఘాలు మోడల్‌గా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల సమాఖ్య పాలకవర్గం, గ్రామ సంఘాల ఈసీ మెంబర్లు, డీపీఎంలు సుధాకర్‌, రవీందర్‌, వకుల, సీసీలు విశ్వనాథం, స్వరూప, సంజీవులు పాల్గొన్నారు.