అక్షరటుడే, కామారెడ్డి: యువత, ఉద్యోగులు బీజేపీ వైపు ఉన్నారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఆదాయ పన్ను పరిమితి రూ.12 లక్షలకు పెంచడంతో ఉద్యోగులకు, మధ్యతరగతి వాళ్ళకు ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు అరుణతార, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు.