అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాజధానిలో అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా పలు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అంటున్నారు.. కానీ వాటికి అనుమతి ఇచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులు ఎవరైనా శిక్షార్హులేనని పేర్కొన్నారు.